HYD: GHMCలో 27 మున్సిపాల్టీల విలీనానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. మంత్రి వర్గం తెచ్చిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనిపై త్వరలో ప్రభుత్వం గెజిట్ జారీ చేయనుంది. గ్రేటర్ హైదరాబాద్ గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఆ దిశగా GHMC పరిధిని విస్తరించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.