SDPT: సిద్దిపేట జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా శ్రీనివాసులు, కార్యదర్శిగా జంగపల్లి వెంకట నరసయ్య ఎన్నికయ్యారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘంలో కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. అసోసియేట్ అధ్యక్షుడిగా చంద్రశేఖర్, పాతురి సుజాత, శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా భరత్ సూర్య, రవీందర్, శ్రీనివాస్ ఎన్నికయ్యారు.