MHBD: జిల్లా BRS కార్యాలయంలో ఇవాళ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మీడియా సమావేశం నిర్వహించారు. తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిని రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముంపు ప్రాంతాల్లో అధికారులు తప్ప ప్రజాప్రతినిధులు పర్యటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు.