WGL: తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండగకు మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కాగా ఈ ఏడాది కాంగ్రెస్ సర్కార్ బతుకమ్మ చీరల స్థానంలో నగదు బదిలీ పథకం అమలు చేయనున్నట్లు సమాచారం. అందులో భాగంగా గతేడాది 2.26 లక్షల చీరలు పంపిణీ చేశారు. మిగిలి ఉన్న 99 వేల చీరలను ఇప్పుడు వెనక్కి పంపిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.