SRPT: నిరుపేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని మార్కెట్ ఛైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులు మద్ది హైమావతికి మంజూరైన రూ.33,500, నావత్ గోరీకి మంజూరైన రూ.29,500ల చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. నిరుపేదలు సీఎంఆర్ఎఫ్ సద్వినియోగం చేసుకోవాలన్నారు.