KNR: నీల్ బత్తే సన్నాట అనే హిందీ సినిమాను చిన్నారులు ఆదర్శంగా తీసుకుని లక్ష్యాన్ని సాధించాలని జిల్లా కలెక్టర్ ప్రమీల సత్పతి పిలుపునిచ్చారు. శుక్రవారం కరీంనగర్ ఫిలిం భవన్లో ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరిగే చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఫెస్టివల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.