సూర్యాపేటకి చెందిన డ్రిల్ మెన్ క్రాంతి గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. బొంబాయిలో సోనీ టీవీ ఇండియస్ గాట్ టాలెంట్ షోలో ఈ రికార్డు దక్కింది. 2 అడుగుల కత్తిని గొంతులో పెట్టుకొని 2018 కిలోల వాహనాన్ని 5 మీటర్లు లాగినందుకు గాను ఈ ఘనత సాధించినట్లు క్రాంతి సోమవారం తెలిపారు.