MNCL: జన్నారం మండలంలోని కవ్వాల్‌లో వేసిన పంటల వివరాలను రైతులు నమోదు చేయించుకోవాలని దేవునిగూడెం క్లస్టర్ ఏఈవో అక్రమ్ కోరారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. పంటల వివరాలను నమోదు చేయించుకోకపోతే ధాన్యాన్ని అమ్ముకునే వీలు ఉండదన్నారు. రైతులు పట్టా పాస్ బుక్‌తో వచ్చి పంటల వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. పట్టా పాస్‌బుక్ లేని రైతులు పహాని, ఆధార్ కార్డు తీసుకు రావాలన్నారు.