MBNR: స్థానిక సంస్థల ఎన్నికల కోసం నియమించబడ్డ పీవోలు ఓపిఓలు ఎన్నికల విధులకు తప్పనిసరిగా హాజరుకావాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు. సోమవారం కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. విధులకు గైర్హాజరైన వారిపై ఎన్నికల నిబంధనలను అనుసరించి క్రమశిక్షణ చర్యలను తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. కాబట్టి అందరూ తప్పనిసరిగా విధులకు హాజరు కావాలన్నారు.