NZB: బోధన్ పట్టణంలోని రాకాస్ పేటలో ఎంఎల్డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఫిల్టర్ మీడియాను మార్చుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ శుక్రవారం తెలిపారు. సోమవారం నుంచి నెల రోజుల పాటు పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్య ఉంటుందని చెప్పారు. వారంలో ఒకరోజు జోన్ పరిధిలో నీటి అంతరాయం కలుగుతుందన్నారు. పట్టణ ప్రజలు మున్సిపల్ అధికారులకు సహకరించాలన్నారు.