MDK: ప్రతి ఒక్కరు ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస రావు పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలైన శాబాద్ తాండ, సీఎం తాండ, ఎల్లిపేట్, ఎల్పుగొండ, కొత్తపల్లి, అబ్లపూర్, అన్నారంలకు చెందిన ప్రజలకు ఎన్నికల నిబంధనలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎలాంటి విభేదాలు, వర్గపోరు సృష్టించకుండా ఉండాలన్నారు.