NLG: నేరేడుగొమ్ము మండలం పెద్దమునిగల్లోని కృష్ణానది ఒడ్డున గల శ్రీశ్రీ గంగా గౌరీ సమేత శ్రీ కేదారేశ్వర దేవస్థానంలో రేపు సాయంత్రం గంగా హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ అర్చకుడు కుర్మేటి ఉమాశంకర్ శర్మ ఓ ప్రకటనలో తెలిపారు. పవిత్ర కృష్ణవేణి నదీ మా తల్లికి సప్త హారతులచే శోభాయమానంగా హారతి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు.