NZB: ధర్పల్లి మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్యంలో సహకార వారోత్సవాలు, మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం ప్రారంభించినట్లు కార్యదర్శి సంతోష్ రెడ్డి తెలిపారు. సంఘం ఆధ్వర్యంలో 7 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా రైతులు భాగస్వాములు కావాలన్నారు. రైతులందరికీ సహకార వారోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.