పెద్దపల్లి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో నవంబర్ 4న కలెక్టరేట్లో రూమ్ నం. 225లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఎం. రాజశేఖర్ తెలిపారు. మెడ్ ప్లస్ కంపెనీలో 243 ఖాళీలకు ఫార్మాసిస్టు, జూనియర్ అసిస్టెంట్, ఆడిట్ అసిస్టెంట్, సెక్యూరిటీ గార్డు వంటి పోస్టుల కోసం నియామకాలు చేపడతారు. ఆసక్తి ఉన్నవారు హాజరు కావాలన్నారు.