WGL: ఖానాపురం, చెన్నారావుపేట మండలాల్లో స్పెషల్ బ్రాంచ్ ఎస్సైగా పనిచేస్తున్న ఎండీ. ఆసిఫ్ (57) ఆత్మహత్య చేసుకున్నాడు. నర్సంపేట పట్టణంలోని వల్లభ్ నగర్లో నివసించే ఆయన, గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో బాధపడుతున్నాడు. శుక్రవారం విధులకు హాజరైన తర్వాత, పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. MGM ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ.. ఇవాళ మృతి చెందాడు.