MDK: జిల్లా కేంద్రంలో సీఐటీయూ రాష్ట్ర మహాసభలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎఎంసీ యార్డు నుంచి పార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. బహిరంగ సభలో ముఖ్య అతిథులుగా బీవీ రాఘవులు, హేమలత, జాతీయ కోశాధికారి సాయిబాబా, రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు, భాస్కర్‌తో పాటు జిల్లా కార్యదర్శి ఏ. మల్లేశం తదితరులు పాల్గొన్నారు.