WNP: సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తిచేసి సాగునీరు ఇవ్వాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. మక్తల్ బహిరంగ సభలో సీఎం చేసిన వ్యాఖ్యలపై నిరంజన్ రెడ్డి స్పందించారు. మాటలు కోటలు దాటుతున్నాయని, రెండేళ్ల పాలనలో ఒక్క పని కూడా చేసింది లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు.