BDK: టేకులపల్లి మండలం దాస్ తండ గ్రామపంచాయతీ లచ్యా తండా నుంచి మంగళవారం యువకులు బీజేపీలో చేరారు. ప్రధాని మోడీ నాయకత్వం చూసి బీజేపీ పార్టీలో ప్రజలు స్వచ్ఛందంగా చేరుతున్నారని జిల్లా పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.