కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఏర్పాటు చేసిన మహిళా బ్లూ కోల్డ్ సిబ్బందికి స్వీయ రక్షణ, నైపుణ్యాలపై ఇచ్చిన ‘షి లీడ్స్’ శిక్షణ విజయవంతమైంది. ఈ శిక్షణ పూర్తి చేసుకున్నందుకు చొప్పదండి పోలీస్ స్టేషన్కు చెందిన మహిళా కానిస్టేబుల్స్ స్వర్ణలత, ప్రియాంక, శ్రీజలను ఎస్సై నరేష్ రెడ్డి అభినందించి, ప్రశంస పత్రాలను అందజేశారు.