సంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అదనపు కలెక్టర్ మాధురి ఇవాళ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో పద్మజ రాణి, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంత రావు, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్, జిల్లా యువజన అధికారి ఖాసీమ్ భేగ్, తదితర అధికారులు పాల్గొన్నారు.