NZB: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని ఉమ్మడి జిల్లాలోని పరీక్షల ఫీజులు చెల్లించని డిగ్రీ విద్యార్థులకు మరో అవకాశం కల్పించినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఈ నెల 13 వరకు రూ.100 అపరాధ రుసుముతో విద్యార్థులు పరీక్ష ఫీజులు చెల్లించవచ్చని తెలిపారు. ఈ నెల 15 లోపు యూనివర్సిటీలో అందజేయాలని ఆయన సూచించారు.