BHPL: జిల్లా మొదటి విడత ఎన్నికల్లో భాగంగా గణపురం, రేగొండ, గోరికొత్తపల్లి, మొగుళ్లపల్లి మండలాలోని 82 గ్రామ పంచాయతీలు, 712 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి EC ప్రచారం నిషేధించింది. పోలింగ్‌కు 44 గంటల ముందు నుంచి సైలెన్స్ పీరియడ్ అమల్లోకి వచ్చింది. బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ప్రచారాలు చేయవద్దని హెచ్చరించారు.