WGL: జిల్లా మడికొండ గ్రామానికి చెందిన కలకొల్ల అనిల్, చెన్నైలోని SRM యూనివర్సిటీలో న్యాయశాస్త్రం (LLM) పీజీలో గోల్డ్ మెడల్ సాధించారు. ఢిల్లీలో జరిగిన కాన్వొకేషన్లో భారత ఉపరాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్, ప్రశంసాపత్రం, మెమొంటో అందుకున్నారు. ఇవాళ గ్రామానికి చేరుకున్న అనిల్‌ను స్థానిక నాయకులు, గ్రామస్తులు ఘనంగా సత్కరించారు.