యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినర్సింహస్వామి ఆలయానికి శనివారం భారీగా ఆదాయం సమకూరింది. వివిధ విభాగాల ద్వారా దేవస్థాననికి ఏకంగా రూ. 26,09,527 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో వెంకట్రావు వెల్లడించారు. ప్రసాద విక్రయాల ద్వారా అత్యధికంగా రూ. 10.42 లక్షలు లభించిగా, కార్ పార్కింగ్ ద్వారా రూ. 4.09 లక్షలు, వీఐపీ దర్శనాల ద్వారా రూ. 3.15 లక్షలు వచ్చాయి అని ఈవో వెల్లడించారు.