సూర్యాపేట జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటితో ముగియననున్నది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సోమవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. 8 మండలాల పరిధిలోని 181 సర్పంచ్, 1,628 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లను స్వీకరిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.