WGL: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు సమీపించడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏకగ్రీవం కోసం ఒత్తిడి, ఒప్పందాలు జోరు మొదలైంది. పలువురు అభ్యర్థులు, పార్టీ నాయకులు గ్రామాభివృద్ధి పేరుతో చర్చలు జరుపుతూ ఒకరిని ఏకగ్రీవం చేయాలని ప్రయత్నిస్తున్నారు. మరికొందరు నగదు డిపాజిట్ చేస్తేనే విత్డ్రా చేస్తామని నిర్ణయాత్మకంగా చెబుతున్నట్లు సమాచారం.