NZB: ఆరోగ్య శ్రీ పథకం బకాయిల చెల్లింపుల్లో రేవంత్ సర్కార్ జాప్యం చేస్తుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా మండిపడ్డారు. ప్రతీ నెలా నిధులు విడుదల చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ హామీ ఇచ్చిందన్నారు. ప్రయివేటు ఆసుపత్రుల్లో సేవలు నిలిపివేయడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని ట్వీట్ చేశారు.