PDPL: రామగిరి మండలం పెద్దంపేట గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం నిలిపివేసింది. తెలంగాణ హైకోర్టులో W.P. 37164/2025 పిటిషన్ పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ నివేదిక ఆధారంగా, ఆర్టికల్ 243, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018లోని సంబంధిత సెక్షన్ల ప్రకారం ఈ నిలిపివేత అమల్లోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.