SDPT: కోహెడ మార్కెట్ యార్డును రైతు సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పిడిశెట్టి రాజు సందర్శించి రైతుల సమస్యలను పరిశీలించారు. 27 గ్రామాల నుంచి వరి ధాన్యం తీసుకొస్తున్న రైతులు హమాలీల కొరతతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ధాన్యం డంపింగ్ ఆలస్యం అవుతోందని పేర్కొంటూ, వెంటనే వంద మంది హమాలీలను నియమించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.