NGKL: వంగూర్ మేజర్ గ్రామపంచాయతీలో పారిశుద్ధ్యం, విద్యుత్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. గత రెండు సంవత్సరాలుగా సర్పంచ్ లేక నిలిచిన పాలనను నూతన సర్పంచ్ పురుగుల యాదయ్య చక్కదిద్దుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధరణ, వీధిలైట్ల ఏర్పాటు, విద్యుత్ లైన్ల మరమ్మతులు చేపట్టి గ్రామ రూపాన్ని మారుస్తుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.