SRCL: చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలోని పల్లె దవాఖానలో మౌలిక వసతుల కొరత వేధిస్తోంది. నిత్యం ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించే ఈ కేంద్రంలో ప్రస్తుతం తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. కనీసం బోరుబావి మోటార్ కూడా అందుబాటులో లేకపోవడంతో, ఆసుపత్రి సిబ్బంది చుట్టుపక్కల ఉన్న పంట పొలాల నుండి బకెట్లతో నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది.