MNCL: జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో నిర్వహించే స్థానిక ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలలో అధికారులు ర్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. జన్నారంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న జడ్పీ బాలుర పాఠశాలలో ఎన్నికల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వికలాంగులు, వృద్ధులు ఎన్నికల కేంద్రానికి వెళ్లి ఓటు వేసేందుకు ర్యాంపులను నిర్మించారు.