MBNR: పీఎం సూర్య ఘర్ ముఫ్తీ బిజిలి యువజనకు మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామం ఎంపికైంది. సౌర విద్యుత్ వినియోగం ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న తరుణంలో నంచర్ల గ్రామం ఎంపికవడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్తు పలకలు ఏర్పాటు చేస్తారు. ఈ క్రమంలో బిల్లుల భారం తగ్గుతుంది.