MLG: ఏటూరునాగారం మండల కేంద్రంలోని మల్యాల గ్రామంలో ఇవాళ ఫారెస్ట్ శాఖ చేపట్టిన బౌండరీ ట్రెంచ్ పనులను గిరిజన రైతులు, గ్రామస్థులు అడ్డుకున్నారు. తాము పోడు పట్టాలతో సాగు చేస్తున్న భూమిలోనే ట్రెంచ్ తవ్వుతున్నారని, దీంతో పశువులు మేపే దారి కూడా మూసుకుపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కొద్దిసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.