మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. చలి తన పంజాను విసురుతోంది. మంగళవారం రాత్రి మహబూబ్నగర్ పట్టణంలో 18 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. చలి కారణంగా తెల్లవారుజామున ఉద్యోగాలకు వెళ్లేవారు, మున్సిపల్ కార్మికులు, చిన్నారులు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలిమంట వేసుకుంటూ సేద తీరుతున్నారు.