SDPT: సంవత్సరం క్రితం మండలాలకు లైసెన్స్డ్ సర్వేయర్లను ప్రభుత్వం నియమించినా ఇప్పటివరకు వేతనాలు ఇవ్వలేదని సిద్దిపేట జిల్లా లైసెన్స్డ్ సర్వేయర్స్ సంఘం అధ్యక్షుడు ప్రశాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత, వేతనాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 25న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.