వరంగల్ ఉమ్మడి జిల్లాలో రెండో విడత 2వ రోజు సర్పంచ్ స్థానాలకు 1,365 నామినేషన్లు, వార్డు స్థానాలకు 3,037 నామినేషన్లు దాఖలయ్యాయి. సోమవారం మొత్తంగా 4,402 నామినేషన్లు వచ్చాయి. వరంగల్ జిల్లాలో సర్పంచ్, వార్డు స్థానాలకు కలిపి 1,255 నామినేషన్లు, హనుమకొండలో 915, ములుగులో 414, జనగామలో 834, మహబూబాబాద్‌లో 1,335, భూపాలపల్లిలో 510 నామినేషన్లు వచ్చాయి.