NGKL: ఓ మహిళపై ఎలుగుబంటి దాడి చేయడంతో తీవ్ర గాయాలు అయిన సంఘటన ఆదివారం బల్మూరు మండల పరిధిలోని పవనకుంట ప్రాంతంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం నిమ్మల సాలమ్మ (45) అనే మహిళ మేకలు కాయడానికి సమీపంలోని గుట్టల్లోకి వెళ్ళగా ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో స్థానికులు మహిళను ఆసుపత్రికి తరలించారు.