SDPT: హుస్నాబాద్ పట్టణంలో సంక్రాతి పండుగ సందర్బంగా టీచర్స్ కాలనీలో ముగ్గుల పోటీ నిర్వహించడం అభినందనీయమని మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆకుల రజిత, వైస్ ఛైర్మన్ అనిత పేర్కొన్నారు. పోటీలలో గెలుపు ఓటములు సహాజమని, ఓడినవారు బాధ పడాల్సిన పని లేదన్నారు. ఇంటి ముందు ముగ్గులు వేస్తేనే ఇల్లు అందంగా కనబడుతుందని అన్నారు. సంక్రాంతి అంటేనే ముగ్గుల పండుగని వారు పేర్కొన్నారు.