HYD: గ్రేటర్లో అడపాదడపా ఉన్న స్విమ్మింగ్ పూల్స్ నిర్వహణ లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయో సైతం తెలియకపోవడంతో, ఇబ్బందులు పడుతున్నట్లు పలువురు జిహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశారు. లిస్టు ప్రకారం వెళ్లినప్పటికీ ఒక్కోచోట సరైన వసతులు లేవని చెప్పుకొచ్చారు. స్విమ్మింగ్ పూల్స్ సంఖ్యను పెంచడంతోపాటు, నిర్వహణ సరిగ్గా చేపట్టాలని ప్రజలు కోరారు.