ADB: రానున్న పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఏఎస్పీ కాజల్ సింగ్ అన్నారు. ఆమె మంగళవారం నార్నూర్ మండలంలో పర్యటించారు. నాగల్కొండ గ్రామపంచాయతీలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీఐ అంజమ్మ, పోలీస్ సిబ్బంది జాదవ్ గోవింద్, నాగోరావ్ తదితరులు పాల్గొన్నారు.