MDK: నార్సింగి మండలంలో 9 గ్రామ పంచాయతీలకు 42 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎంపీడీవో ప్రీతి రెడ్డి తెలిపారు. మండల వ్యాప్తంగా 80 వార్డు స్థానాలకు గాను 14 వార్డు స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని, 66 వార్డు స్థానాలకు 205 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని వెల్లడించారు. గ్రామాల వారీగా అభ్యర్థులకు సర్పంచ్, వార్డు స్థానాలకు గుర్తుల కేటాయింపు చేపట్టినట్టు పేర్కొన్నారు.