MBNR: బ్రిటిష్ పాలకులపై విరోచిత పోరాటం చేసిన వడ్డెర ఓబన్న చరిత్రను పాఠ్యాంశాలలో చేరుస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. వడ్డెర ఓబన్న 219 వ జయంతిని పురస్కరించుకొని జిల్లాలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.