NZB: మోస్రా మండలం గోవూర్లో ఎన్నికల నేపథ్యంలో నవీన్ రెడ్డి అనే వ్యక్తి వినూత్న రీతిలో ప్లెక్సీ ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. సర్పంచ్, వార్డు సభ్యులకు పోటీ చేసే అభ్యర్థులను ఉద్దేశించి, “మా కుటుంబ ఓట్లు అమ్మబడవు” అని ఇంటి వద్ద ప్లెక్సీని ఏర్పాటు చేశారు. ఓటుకు నోటు తీసుకోకుండా, స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇతరులకు ఆదర్శంగా నిలిచారు.