MBNR: తెలంగాణ రాబిన్ హుడ్ పండుగా సాయన్న ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. ఆదివారం ఆయన వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్‌లో ఉన్న విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సాయన్న పేద, బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడినట్లు గుర్తించారు.