BHPL: కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అధిక జేష్ఠ మాసం నవమి ఆదివారం పర్వదిన సందర్భంగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతినెల గ్రామదేవతలకు నిర్వహించే పూజా కార్యక్రమాల్లో భాగంగా పంచామృత అభిషేకంతో పాటు పట్టు వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం అర్చకుడు నాగరాజు పూజలు నిర్వహించారు.