ASF: ఆసిఫాబాద్ మండలంలోని చిలాటిగూడ, రాహపల్లి గ్రామ పంచాయతీల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. 3వ విడతలో ఈ గ్రామ పంచాయతీలలో లేని సామాజిక వర్గాలకు సర్పంచ్ రిజర్వేషన్లు కేటాయించారు. చిలాటిగూడలో SC, రాహపల్లిలో ST రిజర్వేషన్ కేటాయించగా ఆ సామాజిక వర్గం ప్రజలు గ్రామాల్లో లేరు. దీంతో ఈ రెండు గ్రామ పంచాయతీలలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.