MDK: తూప్రాన్ పట్టణంలో నివాసముండే బర్మావత్ రవి (36) అదృశ్యమైనట్టు ఎస్సై శివానందం తెలిపారు. మాసాయిపేట మండలం చెట్ల తిమ్మాయపల్లి గ్రామానికి చెందిన రవి, సునీత దంపతులు రెండేళ్లుగా తూప్రాన్‌లో ఉంటున్నారు. భర్త చేసిన అప్పుల విషయంలో గత నెల 20న రాత్రి గొడవ జరగగా, 21న ఉదయం ఇంట్లోంచి వెళ్లి కనిపించకుండా పోయినట్టు వెల్లడించారు . మంగళవారం ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.