MLG: మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర సమీపిస్తుండటంతో నిన్న రాత్రి మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, SP సుధీర్ రామ్నాథ్ కేకన్, ITDA PO చిత్రా మిశ్రాతో కలిసి జాతర అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. CM రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పనులు త్వరగా పూర్తి చేయాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.