RR: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని షాద్ నగర్ పట్టణ CI విజయ్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల రోజున ఎలాంటి వర్గం లేదా వ్యక్తుల ఒత్తిడికి లొంగవద్దని సూచించారు. ఎన్నికల నియమాలు ఉల్లంఘించిన, ఆటంకపరిచిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రత పరిరక్షణలో ఎవరిని ఉపేక్షించే పరిస్థితి ఉండదన్నారు.